Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్రిలింగ దేశంలో
ప్రభవించిన వెలుగై
అచ్చుల అందాలు
హల్లుల సోయగాలు
అల్పాక్షరాలతో
అనంతార్ధాన్ని అందించే
సాహితీ తరంగిణి
సుమనోహర కవితాగీతిక
మాండలికాల మరుమల్లె
''తెలుగు''భాష
రసరమ్యమై
జిహ్వకు
వ్యాయామమందిస్తూ
సుధలొలికించే జీవధార
తియ్యందనాల ''తెలుగు''
ద్రావిడభాషలతో కలగలిసి
అష్టదిగ్గజాలతో
దిగంతాన్ని స్పశించిన
నన్నెచోడుని జాను ఇది,
నన్నయ్య తిక్కన్నల
జాణ ఇది
గురజాడ, కందుకూరి
జనపాటయై పల్లవించి
సామెతలు, శబ్ద పల్లవాలతో
వికసించిన భాషా పుష్పం
తెలుగుకు ''తెగులు'' పట్టించక
తెలుగు ''వెలుగు''కై
వేద్దాం ముందడుగు
ఎగరేద్దాం
''తెలుగు భాషా'' పతాక
వినువీధుల్లో సగర్వంగా...
- వేమూరి శ్రీనివాస్
9912128967