Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాన కురిసే ముందు
తల్లడిల్లుతున్న మబ్బు
ఏదో పనిమీద జల్దిన పోతున్నట్టు
ఆదరాబాదరగా ఉరికే
పొద్దూకెజాముల చూసిన వాగు
ఆప్త మిత్రుని లాగా
రోజు క్రమం తప్పక వచ్చి
ఇంటెనుక తొట్లె నీళ్ళు తాగి పోయే
కడుపుకింద మచ్చలున్న బెల్లంరంగు ఊరపిచ్చుక
ప్రకతి పూసిన దశ్యాలంటేనే
ఎంత ఇష్టమో..!
మక్కచేను కర్రలకు
మడువదెంపి నీళ్ళు కడుతున్నప్పుడు
మూతికి రాసే పుప్పొడి నవ్వులజ్ఞాపకం కూడా.!
నోట్లేకొచ్చిన కర్రలను
కోతుల గుంపో,పైడి కంటెలో
ఓ మూలకు తరుముతే ఇంకోమూల జొర్రి
పంట పాడుజేసినప్పుడు
ఉడో, ఉడో అంటూ అదిలిస్తూ
చేతుల ఏదుంటే అది
మట్టి పెడ్డ, సేతి కట్టె...
ఏది ఇసిరిన ఇనకపోతే
గులేరు అందుకొని తరిమినప్పటి నిమ్మలం
పైరు మీద ఎగబడ్డవాటిని
ఎట్లన్న తరుమొచ్చు గానీ
పసల్ కు ఒక మాట మార్చే
రాజ్యపుపీడను తరిమేదెట్ల?
ఇంకెంత కాలమని
ఈ పురిటినొప్పులవాగు నాలోంచి ప్రవహిస్తుంది?
వరిగొల్కల కాపుదారు
మాయవల నుండి బయట పడే వరకేనా..?
లోపల గూడుకుట్టుకున్న గుబులు
ఏవో తడితడి దుక్కులు పిలుస్తున్న జాస
మనుసుకుదురుగుండనీయని మన్నుమీద యావ..!
- నాగిళ్ళ రమేశ్, 9100482478 పుప్పొడి నవ్వుల జ్ఞాపకం
వాన కురిసే ముందు
తల్లడిల్లుతున్న మబ్బు
ఏదో పనిమీద జల్దిన పోతున్నట్టు
ఆదరాబాదరగా ఉరికే
పొద్దూకెజాముల చూసిన వాగు
ఆప్త మిత్రుని లాగా
రోజు క్రమం తప్పక వచ్చి
ఇంటెనుక తొట్లె నీళ్ళు తాగి పోయే
కడుపుకింద మచ్చలున్న బెల్లంరంగు ఊరపిచ్చుక
ప్రకతి పూసిన దశ్యాలంటేనే
ఎంత ఇష్టమో..!
మక్కచేను కర్రలకు
మడువదెంపి నీళ్ళు కడుతున్నప్పుడు
మూతికి రాసే పుప్పొడి నవ్వులజ్ఞాపకం కూడా.!
నోట్లేకొచ్చిన కర్రలను
కోతుల గుంపో,పైడి కంటెలో
ఓ మూలకు తరుముతే ఇంకోమూల జొర్రి
పంట పాడుజేసినప్పుడు
ఉడో, ఉడో అంటూ అదిలిస్తూ
చేతుల ఏదుంటే అది
మట్టి పెడ్డ, సేతి కట్టె...
ఏది ఇసిరిన ఇనకపోతే
గులేరు అందుకొని తరిమినప్పటి నిమ్మలం
పైరు మీద ఎగబడ్డవాటిని
ఎట్లన్న తరుమొచ్చు గానీ
పసల్ కు ఒక మాట మార్చే
రాజ్యపుపీడను తరిమేదెట్ల?
ఇంకెంత కాలమని
ఈ పురిటినొప్పులవాగు నాలోంచి ప్రవహిస్తుంది?
వరిగొల్కల కాపుదారు
మాయవల నుండి బయట పడే వరకేనా..?
లోపల గూడుకుట్టుకున్న గుబులు
ఏవో తడితడి దుక్కులు పిలుస్తున్న జాస
మనుసుకుదురుగుండనీయని మన్నుమీద యావ..!
- నాగిళ్ళ రమేశ్, 9100482478