Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ యేలా సందమామ
ముఖం మాడుసుకుంటే తెలుసుకోలేకపోయా
ఎన్నెలోలే ఎలిగే నిన్ను చూసి
నొచ్చుకున్నాడనిజి
ఆ యేలా పూలన్నీ
మూతి ముడుసుకుంటే తెలుసుకోలేకపోయా
పులకన్నా సహజమైన నీ నవ్వులు చూసి
కుళ్ళుకున్నాయనిజి
ఆ యేలా గంధం
అలిగి కూసుంటే తెలుసుకోలేకపోయా
చుట్టూ పర్చుకున్న నీ పలుకుల
ప్రేమ పరిమళం చూసి
ఓర్వలేకపోయిందని
ఈ యేలా మాత్రం
స్పష్టంగా అర్ధమైతంది
సుక్కోలే ఎలిగే నేను
సీకట్లో సిక్కుకున్నది
నీ తోడు లేకనేనని...
- దిలీప్.వి, 8464030808