Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిశబ్దం నిదురపోయినప్పుడల్లా
గాలి ఈలలు వేస్తూ
హుషారుని ఉసుగొల్పుతుంది
దిగులుతనంతో డీలా పడ్డ చెట్టును
గుంబనంగా ఆకుల్ని స్పశిస్తూ
ఆశల గీతాల్ని ఆలపిస్తుంది
చికాకు మనసుకు
తుమ్మెద ఝుంకారమై
అలా,అలా అలల్లా
మెత్తని మలయమారుతమై ఊరడిస్తుంది
గాలి గల, గలలతో
ఊరంతా రెక్కలు విప్పిన పక్షిలా మారి
మనో తీరాలపై పయనిస్తుంది
గాలి ఊరి చుట్టమై వాలిన ప్రతిసారీ
సొగసు సోయగపు చిత్రమై పల్లె పరవశిస్తుంది
గాలి పాడే గమకాల పాటలతో
పల్లె పచ్చని తోరణాలు మధ్య
పసి పిల్లాడిలా హాయిగా
కమ్మని కలల్ని ఎగరేస్తూ
శ్రమ రెక్కల్ని ఆదమరుస్తూ నిద్రకు ఉపక్రమిస్తుంది...!!
- మహబూబ్ బాషా చిల్లెం
9502000415