Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబద్దం
హత్య
మోసం
ఆక్రమణ
ఏదీ తప్పుకాదు
ఎర్రటోపి
నల్లకోటు
నాయకుల
అండ దండిగా వుంటే
ఏదీ తప్పుకాదు
అప్పులు చేసి
పారిపోవటం
అత్యాచారాల చేసి
చంపేయటం
ఏదీ తప్పుకాదు
చెవులు మూసుకోడం
మౌనంగా వుండడం
చలనం లేకపోడం
బూతులు వల్లించడం
జులాయి లవటం
రౌడీలవటం
జూదగాడవటం
కుతంత్రాలు చేయడం
వెన్నుపోటు పొడవడం
ఏదీతప్పుకాదు
దొడ్డిదారి గెలవటం
దొంగ దెబ్బ తీయడం
ఓటునమ్ముకోవడం
జీవితాలనుతాకట్టు పెట్టడం
తార్చటం.
లేపుకెళ్ళటం
ఏదీతప్పుకాదు
పార్టీలు మారటం
ఉద్యమాలకు తూట్లు పెట్టడం
సంపాదనే పరమావధి కావడం
కోట్టలకు పడగెత్తి టాక్సులెగ్గొట్టడం
బూటకపు ఎన్కౌంటర్ చేయడం
సాక్ష్యాలను మాయంచేయడం
తప్పేకాదు
వాహనాలతో తొక్కించడం
పంటలను నాశనంచేయడం
తడిగుడ్డతో హక్కులు హరించడం
అక్రమ కేసులతో నిర్బంధించడం
తప్పే కాదు..
కాని
ఇప్పుడు, ఇక్కడ....
నీతిని నమ్ముకోవడం
నిజాయితీగా బతకటం
న్యాయం కోరటం మాత్రం
నిజం నిర్భయంగా చెప్పడం
తప్పు..తప్పు..తప్పు
ముమ్మాటికీ నేరం
శిక్షార్హం సుమా.
జాగ్రత్త...జాగ్రత.
- కపిల రాంకుమార్, 9849535033...