Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత రాజధాని నడిబొడ్డున..
అన్నదాతల ఆందోళనలు..
మండీలపై ముంతపొగ పెట్టి..
బక్క రైతును కార్పొరేట్ల దయకు..
వదిలేస్తారన్న రేపటి రైతు భీతితో..
అడ్డగోలు శాసనాల్ని వ్యతిరేకిస్తూ..
మడమతిప్పని అన్నదాత పట్టు..
సమైక్య నిరసనోద్యమకారుల హౌరు
సాగు చట్టాలు పట్టాలెక్కకుండా..
తప్పించడానికే పోరు బాటలు !
బారికేడ్ల బాధలు దాటుతూ..
ముళ్ల కంచెల్ని ముట్టడి చేస్తూ..
జలఫిరంగుల్ని జంగ్‌తో జయిస్తూ..
బాష్పవాయుగోళాల్ని భరిస్తూ..
కాడి వదిలి కదం తొక్కుతూ..
ఎముకలు కొరికే చలి పులిని..
చండ్రనిప్పుల్ని కక్కిన ఎండల్ని..
ఉక్కిరిబిక్కిరి చేసే భీకర వర్షాల్ని..
తట్టుకొని ట్రాక్టర్ల కవాతులతో..
అష్టదిగ్బంధనాన్ని అధిరోహించి..
వందల ప్రాణాల్ని త్యాగం చేసి..
నెత్తురు మరకల ఉద్యమంతో..
కరోనా కోరల్ని సహితం లెక్కచేయక..
పోరు విత్తును నాటిన కర్షకులు..
పంట పండాకే ఇంటి వెళ్తాం అంటూ..
మహౌద్యమ సేద్యపు సేనానులు !
ఏడాది పొడవున సుదీర్ఘ పోరుతో..
సాగు చట్టాల రద్దును సాధించి..
జయకేతనం ఎగిరేసిన రైతులోకాన్ని..
దీవించెను రైతు పక్షపాతి భూమాత !
మేధో మథనంతో క్షమాపణలు కోరి..
నేడైనా మెట్టు దిగిన కేంద్ర పాలకుల..
విశాల హదయానికి వందనం చేస్తూ..
ఉడుం పట్టుతో సాధించిన రైతుల్ని..
అభినందన మాలలతో సత్కరిద్దాం
పోరు రైతుకు పట్టాభిషేకం చేద్దాం !
- మధుపాళీ, 9949700037