Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవ జాతి మొత్తం జీవన యుద్ధంలో ఓడిపోయి అంపశయ్యపై ఆఖరి క్షణాల కోసం ఎదురు చూసే గాయపడ్డ దేహంలామౌనంగా కళ్ళు తెరిచిచూస్తోంది
స్వార్ధపు సాలీడు అల్లిన దురాశల దారాల మధ్య చిక్కుబడిన సమాజం నేడు అచేతనంగా బూజుపట్టిన స్మశాన వాటికలా అగుపడుతోంది
మానవ సంబంధాలన్నీ దారితప్పి పరిగెడుతూ
పిగిలిపోయిన దూదిపింజల్లా గాలిలోకి ఎగరాలని చూస్తున్న శిధిలమైన శరీరాలను తలపిస్తున్నాయి
మంచితనం మమకారం మరిచిన మనస్తత్వాలు చివికిపోయిన శరీరాల మాంసపు ముద్దల అడుగున మిగిలిన ఎముకల గుట్టలను గుర్తు చేస్తున్నాయి
నైతికవిలువలు ధర్మాధర్మాలు విడిచిన మానవనైజాలు
శవాల మెడలో వేలాడే వాడిపోయిన పూలదండల రాలిపోయిన గులాబీ రేకులను మరపిస్తున్నాయి
అసూయద్వేషాలు కుళ్లుకుతంత్రాల ఆలోచనల వాసనలతో నిండిన ప్రతి గుండెను తరచి చుస్తే
తెరిచిన శవపేటికలా కుళ్ళు కంపు కొడుతోంది
సమాజానికిప్పుడు కాస్తంత త్యాగాలతో నిండిన మానవత్వపు ఊపిరిలు ఊదాకపోతే స్మశానంలో ఎగురుతున్న అస్థిపంజరాల సమూహంలా మారుతుంది
- ఎదర శ్రీనివాస్ రెడ్డి