Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవికి దండం పెడితే
కవి పద్య పాదానికి పెట్టినట్లే
తినే ముద్దకు పెడితే రైతు పాదాన్ని ముద్దాడినట్లే!
వ్యవసాయం ఎప్పటికీ
వ్యాపారం కానే కాదు
అది మానవీయ కార్యకలాపం!
బలిసిన రాజ్యం నెత్తిన
మట్టి పాదాలు తొక్కితే గాని
కళ్ళ ముందు బోధి వక్షం కదలాడదు!
అందాలు చిందే పార్లమెంట్
పంట పొలాల కన్న
పవిత్రమైనదేం కాదు!
గాయపడిన హలాలకు
క్షమాపణ చెప్పాల్సింది
పెదాలు కాదు తల వంచిన హదయాలు!
మనిషి ఆకలి ముందు
ఆకాశమెంత చిన్నదో మనకేం తెలుసు
అన్నదాతనే అడగాలి!
అతను నీకు నాకు మాత్రమే కాదు
సమస్త ప్రపంచానికి
నిత్య ప్రాణ దాత!
అతనింకా మన కంటికానక పోతే
బంగారు చెంచాతో అన్నం తిన్నా
నిజమైన వికలాంగులం మనమే!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి,
9440233261