Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దోసిట్లోంచి ఇసుకలా జారిపోయే బాల్యపు రేణువులను/
అణువణువునా హత్తుకొని అరచేతిలో పట్టేసి/
ప్రియంగా చేసిన పిట్ట గూటిలో పదిలంగా పొదువుకున్నా/
తీరిక లేని జీ(వి)తపు ఆటలో నుంచి/
తీర్పాటం చేసుకొని తరచూ తనివితీరా తడుముతుంటా/
బాల్యపు ఆనవాళ్లు ఇంకా బతికేవున్నాయనిపిస్తుంది/
గోటీలాటలో గిల్లికజ్జాలు
పాలబువ్వ గోరు ముద్దలు/
అచ్ఛాల ముచ్ఛాలు
తెల్ల గాగితంలా మనసు/
మల్లెపువ్వుల నవ్వులు
ఇంకా ఎన్నో మరెన్నో.../
ఇప్పటికీ బాల్యపు భావాలు భద్రంగా వున్నాయి/
నేటి మనిషితనంలోని
తీరికలు/
ఎప్పుడో తీరాలు దాటిపోయాయి/
ఏ అమావాస్యకో పున్నానికో.../
అంతర్జాలంలో ఆర్జీ పెట్టుకుంటే కానీ కానరారు/
గుండెగూటిలోని గుప్పెడు పసి ఊసుల్ని/
పిట్ట గూటిలో పొందుపరిచాను/
తట్టెడు తీపి మాటల పన్నీరు జల్లుకుందాం/
వీలుచేసుకొని వాలుతారు కదూ...?/
- బొప్పెన వెంకటేష్, 9866584062