Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక పోరాటాన్ని రాజేయాలంటే
గత పోరాటాల తీరుతెన్నుల్ని అవలోకనం చేసుకోవాలి
లక్ష్యాన్ని గిరిగీసుకుని
లక్షణంగా ముందుకు సాగుతుండాలి
దీక్షలుంటాయి నిరీక్షణలుంటాయి
అవమానాలుంటాయి అడకత్తెరలో ఇరికించడాలుంటాయి
ప్రాణత్యాగాలుంటాయి పరిహారాలు చెల్లించడాలుంటాయి
రాళ్లుంటాయి ముళ్లుంటాయి
ధ్వంసముంటుంది విధ్వంసముంటుంది
చెమటకారుతుంటుంది రక్తం పారుతుంటుంది
శాసనసభలో తీర్మానాలుంటాయి లోకసభలో ప్రకటనలుంటాయి
ఎలాగోలాగ పోరాటం చేయడం కాదు
విజయమందే వరకూ పోరాటం చేయాలి
అమరత్వం పుషించే వరకూ పోరు చేస్తూనేవుండాలి
శ్వాసను బంధించినా ఉనికిని బంధించలేరు
తుపాను గాలిని మించి పోరాట గీతాన్ని ఆలపిస్తుంది
అప్పుడే 'కోరస్' అందుతుంది
- కోడం పవన్‌కుమార్
9848992825