Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాడికిబోయినవ్ బిడ్డా....కండ్లకానొస్తలేవు..
మాయదారి కరోనంట....మసిజేత్తదంట...
గడపదాటొద్దురంటే... మాటిన్కబోతివి...
మూతిముక్కు గడ్డంగ గుడైన కట్టరంటే...
దండీలుబస్కీలు తీసెటోన్ని...నాకే అడ్డులేందంటివి
తాకి సంపుతదంటే... నన్నుతాకి అదిసస్తదంటివి
రాజైన, రైతైన, బడుగైన, అమీరైన... ఊకుంటలేదంటే
నేను యమరాజుకే రాజునంటివి....దాని ఊసుతీస్తనంటివి
ఊరమ్మట బడితివి....ఇంటికి కాకుండైతివి...
బొందిలో పానం.... బొరియపాల్టేసి...
కంటిముంగల కట్టె ు- పాడెమీద కాలగా...
అమ్మ అయ్యల కండ్ల నీరింకిపాయె...
ఆలిబిడ్డల బతుకు బీడుపడిపాయె...
అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళకు దూరమైపాయె...
యాడికిబోయినవ్ బిడ్డా....కండ్లకానొస్తలేవు....
- విశ్వనాథం (లలిత)
9701385013