Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెక్కలు వల ఇసిరే
ఏరు ఇది
తరాలుగ తరగని నిధి
తలలో కలలు పొదిగే
తలమిది
పొద్దంచు చీర
దరిలో దోపుకొని
ఈడు పారి ఈల ఏస్తుంది
ఏరుకు ఏండ్లు ఎక్కవు
నిత్తె పొల్ల
గాలిగుంపు తెడల్ని లేపి
అల్లరి చేస్తుంది
ఏటి గెచ్చా ఎకసెక్కాలు చేస్తుంటే
ఏరు సిగ్గుతో ఉరుకుతుంది
దుఃఖం ఆవిర్కె
ఉరుముతుంది
ఏ చినుకు ఎప్పడిదో
ఎరక చెబుతుంటే
బోరుమన్న
బోల బోయి
పూర్వ జీవితాల్ని విప్పి
నీటిలోకి దిగి
ఈదు లాడి
వాదు లాడి
ఏటి కొంగు పట్టుకొని
ఏండ్లెంట ఎల్లిపోతున్న
సిద్ద సెంచారి
కాలనికి తాపడమా!
అనగ అనగ....
ఓ ఎండి పొద్దు
బంగారమ్కె పొద్దు గూకింది.
- మునాసు వెంకట్
9948158163