Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుకుంటూనే వున్నా
ఇంకా నా మీద కన్ను పడలేదని
అందమైన నా పయ్యెదని చిదమ కుట్ర పన్నలేదని
నేను పుట్టిన దగ్గరి నుండీ
నన్ను నా అందాన్ని గౌరవించిన వారెందరో
నేను నిలబడ్డ ఆ కూడలి
ఆసరాగా ఎందరికో ఊరట
చిన్నా చితక బతుకుల
జీవనాధారం నేను
నా పేరే నా ఉనికికి చేటు తెస్తుందని ఊహించనే లేదు
నా నిర్మాణం నిటారుగా నిలబడిన
ఆరు స్థంభాల పునాది
పై గుమ్మటం ఆహ్వానం పలికే నా హదయం
నా చెంత స్వాంతన ఏళ్ళుగా
స్వరాజ్య సమరంలో
తొత్తుల వారసులు
పేర్లు మారుస్తామంటూ ప్రగల్భాలు పలుకుతుంటే
నా సెంటర్లో జనం
ఊరుకోరు సుమీ!!
జెండా కర్ర పాతక మానరు ఆ గొంతుకలో
మత సామరస్యానికి ప్రతీక నా సెంటర్
తలూపే గొర్రెలు కావక్కడ
బిగిసే పిడికిళ్ల కూడలి అది
జిన్నా టవర్ సెంటరా!! తమాషా!!
- గిరి ప్రసాద్ చెలమల్లు
9493388201