Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలకులు ఇప్పుడు నియంతల పాత్రలో
ముందు వెనకా చూడలేని మొండి ఆలోచనల్లో
ఎప్పుడు ఏ శాసనం యమ పాశం అవుతుందో
చేయని తప్పులకు ప్రజలకు శిలువలు
మానవీయ కోణం లేని కఠిన శాసనాలు
మరణ మదంగం వాయిస్తూ మన పాలకులు
పార్లమెంట్ పచ్చని పొలం లో కొచ్చి
మూడు చట్టాలతో మంట పెట్టింది
గుండె కదిలిన రైతులు కాలిపోయారు ఎందరో
ఓట్ల జతరప్పుడు వొదిగి నమస్కారాలు
పదవి కీక్కు పట్టాక పట్టవు విన్నపాలు
సీతాకోకచిలుక లు తిరిగి గొంగడి పురుగు స్వరూపం
Goలు వున్న పలంగా పట్టుకొచ్చి
జీవితాల్ని చిందర వందర చేసి
చెట్టుకు ఒకరు పుట్టకు ఒకరు కుటుంబం చెల్లా చెదురు
చర్చ ఒకటి జరగాలి కదా ఇంటా బయటా
బలవంతపు బిల్లులతో బలవన్మరణాలు దేశమంతా
ప్రజాస్వామ్యం పరువు తీస్తున్న పార్టీల క్రూర పోకడ
ఢిల్లీ ఒక్కటే దూరం కాదు
ప్రగతి భవన్ కూడా పక్కకు రానీయడం లేదు
ప్రజల ప్రాణాల పోయే దాకా పాలకులు దిగి రావడం లేదు
నిలబడాలి నిరసన తెలపాలి
బతకాలి బరితెగించి పోరాడాలి
కుర్చీని కదిలించి శాసనాలు తిరిగి రాయించాలి..
- దాసరి మోహన్,
9985309080