Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మౌనముసుగులో
నల్లని ముఖంతో అలిగిన రాత్రి
తెల్లటి చీకటిలో స్పర్శమగతలో
స్నానమాడిన మనసుతో
శుభ్రపడిన పొరల మధ్య
జ్ఞాపకాలను అలంకరించుకుని
పొద్దుకో రకంగా పురివిప్పే అందంతో
పడగ్గదిలో ముసిరే ఆలోచనకు
విరిసిన కల విప్పారిన ఆశతో
అలలు అలలుగా కనుల పరుగుగా
వేకువ ఒడ్డును తీయగా తాకి
వెచ్చని ఊహల నురగుల మెరుపులు
కళ్ళ జలపాతాలై దూకి,
మనసులో దాచుకున్న రహస్యాన్ని
అక్షరాలా అనుభవంలో విస్తారంగా ఖర్చు పెట్టేకొద్ది
హెచ్చె సంతోషం పెట్టె చెక్కిలిగిలికి
రోజుకొక్కమారైనా నిన్ను అనుకోనిదే
ఉండలేనే మనసా!
- శ్రీ సాహితి,9704437247