Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవిశ్రాంతంగా
ఎంత దూరం పరుగెత్తానో
ఆ చివరొక విశ్రాంత గహముంటుందని!
కను చూపు మేర
నేనూ
నింగీ నేలా తప్పా!
సమూహాలనూ
అనుచరులనూ నెట్టుకుంటూ
ఇక్కడికొస్తే అయాసమొక్కటే సహచరి!
ధ్యాసంతా గమ్యం పైనే
ఒక్కొక్కరు వెనక బడ్డారనుకున్నా
సర్దుకుంటున్నరు!
మలుపు లాగే
జీవితం చివరి వంపు తిరిగిందా
అందరూ ముఖం చాటేస్తారు!
కల్పిత బంధాలకు
వెలిగినంత సేపు
కాంతి ఎక్కువే!
జవసత్వాలు
సూర్య చంద్రుల్లా వెలుగుతుంటే
ఈ ప్రపంచం ఎంత అందమైందో!
ఆ చివర
దారి మూసుకోనుంది
విడువని గ్రహమొకటి కాచుకొని ఉంది!
అవసరం కొద్దీ
ఆడిన మాటల్లో అబద్ధాలుండొచ్చు
అలెగ్జాండర్లా చివర సత్యమే చెబుతున్న!
జీవితంలో
ఎన్నో ముద్దూ ముచ్చట్లు చవి చూశా
మనుమ సిద్ధి పెట్టిన ముద్దే పదిలంగా!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261