Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కూడలిలో తోపుడు బండి చుట్టూ
తోసుకుంటూ తోసుకుంటూ జనం !
బండి బహు చిన్నదే !
వస్తువులు అంగడి అంగడిగా
పుష్పక విమానంలో ఉన్నట్లే
పెద్ద షాపులాగే షోకుల బండి
తోపుడు బండి చుట్టూ గుంపు గుంపుగా ఉన్నది
ఆడంబరంగా ఉన్నవాళ్లు కాదు !
భేషుగ్గా తప్తిగా ఉన్నామనే నిరాడంబరులే
చిన్న చిన్న వస్తువుల కోసమైనా
సందడిగా తోపుడు బండి వద్ద
జనం బేరసారాలు తక్కువేం కాదు
ఎంత వారికి అంత బేరసారాల కళ
పేస్ట్ బ్రష్ షేవింగ్ మిషిన్లు
టీ ఫిల్టర్ ఐరన్ పిచు చిన్న కత్తెరలు
చిన్న చిన్న బొమ్మలు -
పెద్దగా కొలువు తీరినట్లే
జాతరగా తోపుడు బండి మీద బహు జనం బజార్ !
అద్దాల బీరువాల్లో లేవని
ఇవేం తక్కువ నాణ్యత ఉన్నట్లు కాదు
భేషుగ్గా పనిచేస్తాయి
పనికి వెనుక ముందు కావు ముందుకే
ఒకటి కొంటే ఇంకోటి ఉచితం
మైకులో అందరి చెవిలో తోపుడు బండి
జనాకర్షణ ధనాకర్షణ మంత్రం !
ఉదయమే తోపుడు బండితో పాటు
పైన సూర్యుడూ నడుస్తాడు
సూర్యుడు తోపుడు బండి వాడు
ఇద్దరూ ఒకేసారి ఇంటికి చేరుతారు
ఇద్దరూ కర్మ యోగులే
తోపుడు బండి చిన్న చిన్న గల్లి గల్లీలో
కదలిపోతున్న షాపింగ్ మాలే మరి !
- కందాళై రాఘవాచార్య, 8790593638