Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విరిబాల వంటి సుకుమారం
మనసు నిండా మమకారం
నిండైన ఆత్మ స్థైర్యం...
ఆశయ సాధనలో మొక్కవోని ధైర్యం..
సహనం హద్దులు దాటితే మాత్రం.. దాల్చుతుంది ఉగ్రరూపం.
అయినా అనాదిగా వంటింటి కే
పరిమితం!
కానీ..
కాస్సేపు నీ ఇగోని పక్కకు పెట్టి
మనో నేత్రంతో చూడు..
సరికొత్త రూపం సాక్షాత్కరిస్తుంది..
నిగూఢమై వుంటుంది పరాక్రమం..
కరవాలం చేతపడితే శత్రువులు హతం.
అధికారంతో సంఘంలోని
కలుపును తీస్తుంది.!
అసాంఘిక శక్తులను అడ్డుకుంటుంది.!
వెన్ను చూపని తెగువతో
రాజ్యాలేలినా...
సష్టి రహస్యాలు కనుగొన్న
శాస్త్ర రంగంలో నైనా..
సాటిలేరు..మగువ తెగువకు!
ప్రజ్ఞ పాటవాలకు నిలువెత్తు నిదర్శనం...
ఇష్టమైన కళల్లో పొందుతుంది నైపుణ్యం!
సకల శాస్త్రాల్లో ఆరితేరినా
కుటుంబానికి ఇస్తుంది ప్రాధాన్యం!
చీకట్లో మెరిసే నక్షత్రాల వ్యక్తిత్వం... మహిళ మానసం
ప్రేమ దేవతలా ఆదరిస్తుంది.
ఆదిపరాశక్తి లా దుష్ట సంహారం
చేస్తుంది!
అంతటా తానే.... అన్నింటా తానే!!
మహిళ లేని మహి.. శూన్యం!!
- ఎం.పి.ఊర్మిళా జ్యోతి,
9848675917