Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా కున్న ఆ రెండు కళ్ళు
మా ఊరికున్న నీళ్ళ చెలిమెలు/
నా నుదుటి మీద మెరిసే బొట్టు అది
మా ఊరిని ఆదుకునే జోగినాథుడనే ఆపద్భాందవు/
నా శిరస్సుపైన నిలిచిన శిఖరం
అది మా ఊరి నడిబొడ్డున
నిలబడిన మద్దిరంగం/
నా కున్న రెండు చేతులు
అరచేతులను చాపే మా ఊరికి
ఇరువైపుల ఉన్న మర్రిచెట్లు/
నా కున్న రెండు కాళ్లు
మా ఊరి పిల్ల కాలువలకు
నిజమైన ఆనవాళ్ళు/
నా మదిలో రూపుదిద్దుకున్న
అందమైన చిత్రం/
అది మా ఊరి అద్దంలో మెరిసే
నా ముఖచిత్రం!!
- ఎస్. జవేరియా,
9849931255.