Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1. వారన్నారు -
సత్యం ఎప్పుడూ
నాకు ఎదురుగానో
పక్క పక్కనే నడుస్తూనో
నాకు సమీపంగా కూర్చొని
నా సమక్షంలో నన్ను క్రీగంట వీక్షిస్తూనో
నేను కావ్యాలతో సంభాషిస్తూ ఉంటే
తలుపు పక్కన నిలబడి
చూపులతో దాగుడుమూతలాడుతూనో
నేను అక్షరాలు దిద్దుతుంటే
నన్నే తదేకంగా చూస్తూనో ఉంటుందని...!
నా నీడగా అడుగుజాడగా
నా సన్నిధిలో నన్ను ఆసాంతం అల్లుకునో
బిగియారా కౌగిలించుకొనో
ఏకాంతంలో నా ఒడిలో కరిగిపోతూనో
చేతులు చాచి ద్వారాలు తెరిచి
నన్ను ఆత్మీయంగా ఆహ్వానిస్తూనో
నా ఆత్మని పూరెమ్మలతో ఒడిసిపట్టుకుని
అనూహ్య లోకాలలో విహరింప చేస్తూనో ఉంటుందని...!
2. కానీ ఇప్పుడే తెలిసింది!
సత్యం అరూపి ుు
దానికి ఇలానే ఉండాలని
ఈ ఆకారంలో మాత్రమే దర్శనం ఇవ్వాలనే నియమం లేదు
మన ఊహల్లో మాత్రమే ఉండి మనం ఇంకా చేరుకోలేని
seventh state of matter లానైనా కనిపించవచ్చు !
3. సత్యం బహురూపిు-
ఎలా అయినా ఉండొచ్చు
కలల్లో, జ్ఞాపకాలలో, ఆలోచనల్లో
భావాలలో, సందేహాలలో, అనుమానాలలో
మబ్బు తెరల్లా నన్ను చుట్టేసి ఉండొచ్చు
గదిలోనో, హాల్ లోనో,
నా jurisdiction పరిధులు
నా radius పరిమితులలో మాత్రమే కాదు
మన Orbit కు ఆవల కూడా ఉండొచ్చు
భూమ్యాకర్షణకు అతీతంగా ఉన్నా
నన్ను తనలోకి లాక్కుంటూనే ఉండొచ్చు..
4. సత్యం నైరూపి -
వినికిడి మేరా Varandahలలోనో
కనుచూపు మేరా Corridor లలోనో
Wireless Satellite ప్రసారాల దూరంలోనో
అల్లంతదూరాన అంతరిక్ష వీధిలోనో ఎక్కడైనా ఉండొచ్చు
5. సత్యమే శివమ్!
marble floor పై సున్నితంగా నడుస్తూ
బింబ ప్రతిబింబాలు రెండూ కలిసి చలిస్తూ
కొంగులో నేసిన గులాబీలను నేలపై రాలుస్తుంది
గోడవారగా పయనిస్తూ వసారా చివరకు చేరుకొని
కిటికీ దగ్గర ఆగిపోయి
అద్దాల గుండా ప్రపంచాన్ని వీక్షిస్తూ
ఏ పిల్లగాలి తాకిడికో
ఏ జ్ఞాపకాల ఉరవడికో
పెదాలపై చిర్నవ్వులను గాలిలోకి విసురుతుంది... !
6. సత్యమే సౌందర్యం!
ఎక్కడున్నామనే దాని కన్నా
ఎంత ఱఅటశ్రీబవఅషవ చేసామన్నది కదా పాయింట్!
తల పైన ఆకాశంలో
వెలుగుతూ వేలాడుతున్న నక్షత్రాలు
పాదాల కింద గరుకుగా నున్నగా తాకే మట్టి రేణువులు
గులాబీ అంచు పచ్చని ఆకుల చీరను దేహం నిండా చుట్టేసి
ప్రవహించే నదుల కురులు
వెన్నెముకను సున్నితంగా స్పర్శిస్తూ ఉంటాయి
ఎడమ భుజం పై నుండి జీరాడుతున్న చీర కొంగును
చేతిలో మడిచి బొటన వేలు చుట్టూ చుట్టేసి
ఏడేడు అడుగులు ముందుకు నడిచాక
గాలిలోంచి తేలి వచ్చే ఏ మంత్రాలకో ముగ్ధమై
ఒక్కసారిగా సిగ్గిల్లిన భారంతో తలను దించి
ఏ పట్టు తెరల చాటుకో
పట్టుబడకుండా పక్కకు తప్పుకుంటుంది !
7. Truth is omniscient
Goodness is ubiquitous
Beauty is omnipresent
- మామిడి హరికష్ణ