Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెలవంక రాతిరి
నిదురను దోచింది
కనురెప్పల పాట
మనసును తాకింది !
నడిరేయి జాములో
కొలిక్కి రాని వాక్యాలు
పురిటి నొప్పుల్లో
సంధి కొడుతున్న భావాలు !
పీడ కలగన్న ఏ పిట్టో
పల్లవి లేని పాట ఆలపించింది
ఆద మరచీ నిదురోని
గుండె సడి లయ తప్పింది !
తెలియని మత్తు ఏదో
మగతై రెప్పలపై వాలింది
కదిలీ కదలని కలం
అసంపూర్ణ కవితను మిగిల్చింది !
ఇక ఏ వేకువ వెన్నెలో
చీకటి రాత్రులను చిదిమి
తూరపు ఆకాశాన ఇనబింబమై
సంపూర్ణ కవితను చిత్రించాలి !
- సురేంద్ర రొడ్డ, 9491523570