Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బర్కత్ల రంజాన్ కోసం
రహీంచాచా
ఏడాది ఎదురుచూపు
మరో ఏడాది కొనసాగింపుకే
ఖర్జూరమే కావాలా
ఏ ఉప్పుగల్‌లో
ఇఫ్తార్‌ను పూర్తిచేయకపోదు
నిమ్మకాయలేనా దాహార్తిని తీర్చేది
రోజంతటి రోజాకు
గ్లాసుడు మంచినీళ్లు తప్తినీయకపోవు
అనార్ మౌజ్
ఏది అమ్మితే ఉపవాసాలకు
నిండు సత్తువ వస్తుందో
సంత్రా మౌసంబీ
ఖర్బూజ తర్బూజ్లు
ఏవితింటే ధరల మంటలు చల్లారుతాయో
అర్థాకలినైనా తీర్చే
కిరాయి బండికిపుడు
నాలుగు టైర్లూ పంక్చర్లే
ఫలసాయానికిపుడు
అందరూ అంటరానివారే
అన్ని ఫలాలూ అందని ద్రాక్షలే
(మేవా = పళ్లూ ఫలాలు)
- నస్రీన్ ఖాన్,
9652432981