Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయించే సూర్యుడు
ఉష్ణ రక్తకాసారంలో మండుతున్న గుండె
గురిచూసి వదులుతున్న బాణపు దిశ
అతనెప్పుడూ తూరుపుదిక్కే
ప్రశ్నించే గొంతుక
నిట్టనిలువునా చీలే నియంతృత్వం
నివురుగప్పిన జ్వలించే నిజం
వాడెప్పుడూ దక్షిణంవైపే
ఊబిలో కూరుకుపోతున్న వాగ్దానం
ఉరికంబం ఎక్కిస్తున్న ఆశల జలతారు
గారడి ఆటలో కనికట్టును తాకట్టుపెట్టిన విన్యాసం
వీడిదెప్పుడూ పడమటి చూపే
ఊకదంపుడు ఉపన్యాసాల్లో రాలుతున్న ఊక
ఊరడించే మలాం పూతలు
పువ్వులోని మకరందాన్ని తాగే భ్రమరం
ఇతనిదెప్పుడూ దక్షిణం గోలే
దిక్కులు పిక్కటిల్లే ఆకలి అరుపులు
వెలుగు చీకటుల మధ్య వ్రేలాడుతున్న బతుకులు
మంచు చినుకుల కింద కూరుకుపోతున్న కళేబరాలు
దిక్కులనన్నీ ఏకం చేస్తున్న ఏక్ సితారా రాగం
రగులుతున్న నిప్పుల కుంపటిలోంచి
వెలిగిస్తున్న పోరాటదీపం
- కోడం పవన్‌కుమార్,
9848992825