Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహంకారానికి,
ఆత్మ గౌరవానికి నడుమ ఓ యుద్ధం జరుగుతోంది,
ఆధిపత్యానికో,
అది ఏ పైత్యానికో,
అర్థం కాని లోకం ఆద్యంతం చోద్యంగా వీక్షిస్తోంది,
గగన తలాన మత్యు లోహ విహం ''గద్దలు'' ఎగరడం చూసి,
బంకర్లో దాగిన ఓ తల్లికోడి, పిల్లలతో సహా బిక్కుబిక్కుమంటూ కాలాన్ని పొడుచుకు తింటోంది,
వేల తూటాలు పేలి,
వందల శవాలు రాలి...
నేడో, రేపో యుద్ధమైతే ముగుస్తుంది....
కానీ ఆ తర్వాత....??
రుధిరమంటిన రహదారులు, పతనమైన పాత గోడలు,
శిథిలమైన నగరాలు, నలుదిక్కులా ఆర్తనాదాలు,
నిజం చెప్పు....
ఇదే కదా యుద్ధమంటే....?!
స్మశానాల ఆకలి తీర్చడానికి అమాయకులను
బలివ్వడమే కదా యుద్ధమంటే....?!
రెపరెపలాడే శ్వేత పతాకానికై,
రెక్కలు విప్పే శాంతి కపోతానికై,
వేచి చూసి, అలసి సొమ్మసిల్లిన
ఓ ముసలి కళ్ళ అంచుల్లో ఎప్పుడో చిక్కుకున్న
ఓ అశ్రు బిందువు నేలరాలుతుంది....
యుద్ధమంటే సరదా పడి,
చివరికి ఏమీ సాధించలేక
రక్తమంటిన రిక్త హస్తాలతో,
తెగిపడ్డ తలలు, చలనం లేని దేహాల సాక్షిగా
కరచాలనం చేస్తూ....
''రణ''రంగస్థలపు నాటకాన్ని
రక్తి కట్టిస్తారు చివరికి ''ఆ ఇద్దరు....''
- జాబేర్.పాషా, 00968 78531638
మస్కట్ (ఒమన్)