Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫలితాలు వెలుబడి ఓడిపోయాక
ప్రయత్నం వేళ్ల నుండి మొదలు పెట్టాలి
కారణాలు తొడుతూ కామెంట్ చేయొద్దు...
వెనకాల నవ్వులు తాకుతుంటాయి
తిరిగి చూసేంత సమయం ఎక్కడిది
నడవాల్సినది కోటి కోసులుంది ముందు ముందూ
అవమానమని చెప్పుకోవడం అవమానమే
విజయం అన్నీ తిరిగి అప్పగిస్తుంది
అప్పటి వరకు నో కామెంట్ ప్లీజ్
వోడిపోయక వొంటరి వైపోవాలి
కర్ఫ్యూ పెట్టుకుని కమిట్మెంట్ పెట్టు
కామెంట్లతో కాలం కరిగించకూడదు
గొప్ప ప్రయత్నము తో గెలిచావు
ఇక మైకులన్నే వెంట పడతాయి
సూత్రాలు చెప్పవద్దు కామెంట్స్ కట్టి పెట్టు
విజయం అసూయ మోసుకుస్తుంది
చూట్టు ముట్టూ గారడీ మొదలు అవుతుతంది
కామెంట్స్ చేయక కూల్‌గా వుండిపో
గెలుపు ముందూ గెలుపు తరువాత
నా కామెంట్ ప్లీజ్ నో స్పీచ్ ప్లీజ్
ఒక చెట్టు లాగా స్ఫూర్తిగా నిలవాలి అంతే
- దాసరి మోహన్, 9985309080