Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రిక్టర్ స్కేల్ లాంటి ఓ పరికరాన్ని
కనిపెడితే బావుండు
మరిచిపో అన్న మాటకి
నా హదయమెంత కంపించిందో !!
బీటలు బారి తనువుని ఎంత చీల్చిందో !!
కమిలి కుమిలి కన్నీరుని జార్చకుండా
జాగరణ చేసిన కన్నులని అడగాలి
వేదనెంతో నానుండి నన్ను వెలిసిందని
నీ మనసులో నాకై టెలిస్కోపుగా వెతికానని !!
హిమనీ నదిలా ప్రవహించే
నీ నవ్వుల సడితో అనునిత్యం
ఆనందోత్సవం
కానీ నేడిలా ఢలాీ పడిందేంటో !!
హదికి కర్ఫ్యూ ఎందుకు పెట్టావో ఏంటో !!
నీ మౌనం నిర్ధాక్షణ్యంగా శిక్షిస్తుంటే
నేను రోధిస్తూనే వున్నా మౌనంగా !!
మౌనం లావా కంటే ప్రమాదకరంగా
సెగలు గక్కుతుంటే
అప్పటికే విస్పోటనం జరిగివున్న
హదయం నామరూపం లేకుండా పోతుందేమో !!
ఆనవాళ్ళు ఆవిరిగా కూడా మారవేమో !!
ఉద్యానవనం లాంటి ప్రేమను ఎందుకు
ఒక్కసారిగా థార్ ఎడారిలా మార్చావ్ !!?
గులక రాళ్ళతో నిండిన డబ్బలా
ఎందుకు వినలేని శబ్దాన్ని చేరదీశావు !!?
ఎందుకీ చీకటిని మరింత చీకటిగా మలిచావు !!?
నాకు తెలుసు
నాపై ప్రేమ పర్వతమంటిదని
అది దాచలనుకున్నా !! దాగదని
మసి పూయాలని చూస్తే
సుద్ద ముక్కవై ఐ లవ్ యూ అని రాయలేవా !!
ఆ ఒక్క పదమే నిను - నన్ను కలిపే బంధం..
అదే మన అడుగులకు రెడ్ కార్పెట్..
నాకు నమ్మకం వుంది
నా ప్రేమనేం సాగర తీరాన ఇసుక పై రాయలేదు
అలల తాకిడికి కొట్టుకుపోయేలా !!
కాలం కన్నీరు పెట్టినా !!
కనికరించక కలిసి సాగే ప్రయాణమవుతాం...
- మహేష్ వేల్పుల, 9951879504