Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మండే
బొగ్గు గుణం కార్మికుడికే ఎరుక
భగభగ మండే
నిప్పు గుణమూ
శ్రామికుడికే బాగా ఎరుక...
నెత్తురు, చెమటను ధారపోసి
నైపుణ్యాన్ని ఒలకపోసి
సకల రకాల వస్తువులను ప్రతిష్ట చేసి
సామాన్యుడిగా జీవించడం
తనకే తెలుసు...
మట్టితో మమేకమై
యంత్రాలతో కలగలిసి పోయి
పనిముట్లే ప్రాణాధారాలుగా
పని ప్రదేశమే దేవాలయముగా
తోటి శ్రమజీవులతో ఐక్యమై
సాదాసీదాగా సాగిపోయేతత్వం
అతనికే చెల్లు...
యాజమాన్యపు దోపిడీలు
ప్రభుత్వాల నిర్లిప్తత
పెట్టుబడుల కథాకమామీషు
వ్యవస్థలో ఉన్న అనేక లోపాలూ
శ్రమజీవులకు బాగా ఎరుకే...
మోసపు ఆసాములను
దోపిడీ దళారీ వ్యవస్థను
రాజ్యపు నిర్లక్ష్య వైఖరిని
దునుమాడే రోజుకోసమే
చెమట చుక్కలు వేచి చూస్తున్నాయి..
పొక్కిలి చేసిన నేల పొత్తిళ్ళలో
వీరత్వపు బీజమొకటి మొలకెత్తుతుంది...
అణచివేత చర్యలకు అగ్గిపెట్టే
ఘడియను కార్మిక శక్తి కాంక్షిస్తున్నది....
పలుగూ పార పదపదమంటున్నది
నాగలి కొడవలి సైసై అంటున్నవి
కత్తి సుత్తి సమరానికి
సైరను ఊదుతున్నవి
ఇక చైతన్యం చెందిన కార్మిక శక్తి
కదనానికి కాలు దువ్వి కదులుతున్నది...
కాచుకోండిక బడా దోపిడిదారులారా
పారిపోండిరా నయా మోసకారులారా
దాక్కోండిరా మేక వన్నె పులి వంటి
్్మేధావుల్లా రా
ఇక సెమటసుక్కలదే రాజ్యమూ, రాజ్యాధికారమూ...!!
- సుద్దాల వినోద్ కుమార్
9908312949