Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్టినందుకు కాదు.. మానవత్వం లేనందుకు
వ్యక్తిగా పెరిగినందుకు కాదు.. పగ, ప్రతీకారం నేర్చినందుకు
ఎదిగిన యువతలో నేడు.. నైతికత విలువలు కరువైనందుకు
సిమాజమా.. సిగ్గుపడు
తోటివారు తగువులాడితే... తందానా చూసినందుకు
బయటమాత్రం బడాయి మాటలు.. ఇంట్లో మాత్రం కులం కుంపటి
స్వచ్ఛమైన ప్రేమకు కులం, మతం రంగు పూసినందుకు
సమాజమా... సిగ్గుపడు
మానవత్వం మరిచిపోయి.. అదునుచూసి సంపినందుకు
హత్య లాంటి రాక్షస క్రీడకు శిక్షలు లేనందుకు
కాపాడమని కాళ్లుమొక్కిన కనికరం లేనందుకు
సమాజమా... సిగ్గుపడు
దళిత బిడ్డల ప్రేమలకు.. కులం పేరుతో సంపినందుకు
ప్రేమిస్తే కాదని...పరువు కోసం సంపినందుకు
ఉన్నోడికి ఒక న్యాయం...లేనోడికి ఒక న్యాయం
ప్రణరు, నాగరాజు ప్రేమలకు బలైనందుకు
సమాజమా... సిగ్గుపడు
కంటి ముందు గొడవలైన.. కదలలేని దద్దమ్మలు
నాకెందుకులే అంటుపోతే.. నవసమాజ నిర్మాణమెలా
మనుషులున్న ఈ సమాజం ఇంకెప్పుడు మారును..
సమాజంలోని మనుషుల్లారా... మానవత్వం చూపరా
అన్యాయాన్ని ఎదిరించడానికి కదంతొక్కి కదలరా..
- లింబూరి లక్ష్మణ్ (తేజ)
ఆర్టిస్టు అండ్ జర్నలిస్ట్, బోధన్. నిజామాబాద్