Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంపద ఎక్కువ అయ్యాక
సుపుత్రులు తల్లి తండ్రుల జాడ నుండి
జారిపోయి దుర్పుత్రుల అవతారం
ఏ సమయాన ఏ పాపం మోసుకొస్తారో...
సదువుకుంటే కదా సంస్కారం
పట్టాలన్నీ ప్రయివేట్ వేలంలో కొన్నవే
టైం పాస కే కాలేజీ గీలేజి కానీ
కాలర్ ఎగరేస్తూ
ఖాందాన్ పేరు చెప్పుకుంటూ గడపడమే
ఒక పనంటూ ఉంటేగా
రోడ్ల పొంట కార్లు వేసుకొని తిరగడమే
పొగరుబోతు ఆంబొతులా రాక్షస విన్యాసం
పసికూన కంట పడిందా కాటేయడమే తరువాయి
చట్టం చుట్టంగా కంచె కడుతుంది
శిక్ష కు వేల వెనకడుగులు వేస్తుంది
పవర్ గల నాయకుల పదవుల గళాలు
పరదా వెనకాల హుకుంలు జారీ చేస్తాయి
పబ్బులు ఏం నేర్పిస్తాయి
పచ్చిమ వికత చేష్టలు రుద్దడం
ఖజానాకు పాపపు సొమ్ము జమ చేయడం తప్ప
ప్రజా ప్రయోజనం ఒకటి అయినా ఉందంటారా...
- దాసరి మోహన్, 9985309080