Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నన్నెట్లా మాట్లాడమంటావ్?
అ.. నా నోరు పెగలదు
నిప్పు పెట్టందే
నా కడుపు చల్లారదు!
విద్వేష వాక్యాలే
నాకు కంఠో పాఠాలు
మీరిట్లా నిషేధం విధిస్తే నోరాడదు!
కూల్చే భాష
నాల్కలు కోసే భాష
నా ఉపన్యాసాలకు పునాదులు!
ఉద్ధరించే మాటలకు
సమూహాలు చలించనప్పుడు
ఉద్రేకపు మాటలే పట్టం కట్టేవి!
అభివద్ధి
రాజనీతి అంతా ట్రాష్
జో జీత్ గయా ఒయి సికందర్!
అధ్యక్షా! అర్థం చేసుకో
ప్రజలు కలిసున్నంత కాలం
మన పప్పులు మరోసారి ఉడకవు!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261