Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్రిగ్గర్ మీదనీవేలు
పాయింట్ బ్లాంక్ రేంజ్లో నాతల క్షణం ఆలస్యంలేక
కాల్చిపారేయక
కళ్ళలో ఆబెదురుపాటు ఎందుకు
నువ్వురమ్మంటే రావడానికి
పొమ్మంటే పోవడానికి
నేను గెస్టునో... టూరిస్టునోకాదు...
ఈనేల మూలవాసిని
వేళ్ళు మూలమూలలకు
వ్యాపించివున్నరు
కదిపితే ప్రకంపనలే
నిర్ధయగా
నాకొమ్మల్నినరికేయాలనుకున్నవ్
చిగురించేతత్వాన్ని
నిర్మూలించలేకపోయావ్
నిర్ధాక్షిణ్యంగా
మొగ్గల్నినలిపేయాలనుకున్నావ్
వికసించే
గుణాన్నికనిపెట్టలేకపోయావ్
ఉన్నఫలంగా
ఫలాల్ని కాజేయాలనుకున్నావ్
పునరుత్పత్తి
రహస్యాన్నిపసిగట్టలేకపోయావ్
అంతెందుకు విత్తనంగానే
తొక్కిపెట్టాలనుకున్నావ్
నీపాదాలను పగలచీల్చుకొని
మొలకెత్తలేదా...!
చెట్టూ పుట్టా గుట్టా
సకల సంపదలన్నీ
గుప్పిటపట్టుకున్నానని
విర్రవీగుతున్నవ్
మట్టిని ముట్టుకోగలవా
కాలం కన్నుతెరిస్తే
ఉన్నఫలంగా
ఎవడైనా పీఠందిగి
తలవంచుకొనివెళ్ళిపోవాల్సిందే
ఇంకేం ఆలోచిస్తవ్
నీ వల్ల కాదుగాని
లోపలికి మలుచుకొని
వెనుదిరిగి చూడకుండా
వచ్చినదారినేవెళ్ళిపో...
నువ్వెన్నిసార్లు రాల్చినా
నేను చేరేదిమట్టిపొత్తిల్లలోకే
మట్టినా ఉనికి
మట్టి నాపొగరు
మట్టినాఅస్థిత్వం
నేను మట్టిపొట్టలోని ధాన్యపుగింజను...
- కొండిమల్లారెడ్డి