Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమస్యల సాంధ్యారాగం మొదలై
తిమిరం అలముకుంటున్న సమయం
చింతలు వింతలు పొడిచి
కొన్నిఘడియలు కాలగర్భంలో కలిశాక
ఆకాశం జాబిలి జాడలేని నల్లసముద్రం
ఈ పెంజీకటి హదయవీణ గీతమిది
కోటిఆశల కలికి కళ్లు ఎదురుచూపుల్లో అలిశాక
ఎన్నో ఒత్తిళ్ల కౌగిళ్లతో ఒళ్లు నలిగాక
ఏవో పీడకలలు దిగులుమనసును ముట్టడిస్తాయి
వలపుల పగటిమోహినీపడుచు పిశాచం
మత్యు చీకటిలో సైతం వెంబడిస్తూ వెంట వస్తుంది
పోటెత్తేనెత్తురుతో తష్ణనదుల కెరటాల గుండా
తెల్లారేదాక ఈ కష్ణవెన్నెల్లో ఈదాలి
శోకకడలి అగాధాలంచులదాక మునకలేయాలి
తీగసాగినఆలోచనల నిరాశామెరుపు పూల నిశివసంతం
ఈ నిశీధిఎడారి వడగాడ్పులలో
ఒంటరిమనిషికి వేదనలే అనంతం
మనుగడ పల్లవీ,గుండెలోతు బాధే చరణాలైన
రాతిరి రాగగీతం ఇది
సంఘర్షణల నడిఝామునైరుతిగాలులు వీచి
చల్లబడ్డ యెడదల కరిమబ్బుల తొలకరి చినుకుల
శతిలయల నేపథ్యగానమిది
రేయంతా మన చుట్టూ అల్లుకున్న
చిమ్మచీకటి అలల గాఢపరిష్వంగం
ఈ అంధకార బ్రతుకు గుహలో
కునుకుమహారణరంగం ముగిశాక
తూర్పు దిక్కు అరుణోదయవెలుతురు
అదే మన ఆశల ఉషోదయం
కష్టం ఉంటేనే సుఖం విలువ
పగటికి చీకటే ఇహ చలువ
ప్రతీ రాత్రి ఒక అంతర్వీక్షణం
ప్రతీ రాత్రి ఒక అంతర్యుద్ధం మనకు
మలిసందె నుండి తొలిపొద్దు దాక
వేదన నుండి ఆనందాలవెలుగుల దాక
మన ప్రస్థానం.
- రమేశ్ నల్లగొండ, 8309452179