Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ చీకటి! చూసుకో నీ మొహం
మారింది గాఢంధాకారం
అమ్మ తెరిచిన నయనాలకు
వెలిగింది ఇల్లు దేదీప్యమానం.
పంపకంలో ఒకరికి భవనం
మరొకరికి వ్యాపారం
ఇంట్లో పిన్నవాడినైన నాకు
దక్కింది అమ్మ, వరం.
ఎలా తెంచుకొని వెళ్లాలి
నా ఉనికి సంకెళ్లను
జీవితాంతం ముడిపడినవి, ఎక్కడికెళ్లను
పథ్వియే గదా నా తల్లి
దాన్నొదిలి నేనెక్కడికి వెళ్లను.
పెనుతూఫానులో
నా నావ చిక్కుకున్నప్పుడల్లా
దిక్కు తోచక కలవరం చెందినప్పుడల్లా
ప్రత్యక్షమవుతోంది కలల్లో అమ్మ
ప్రార్ధనలు చేస్తూ ఎప్పటిలా.
మరోసారి మారాలని ఉందిగా
కోరిక దేవదూతగా
అమ్మను కౌగిలించుకొని విడవకుండా
సదా ఉండాలని పసివాడిగా.
అనువాదం :
మహమ్మద్ అమ్జద్ అలీ
00 966 507662638