Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొరలు పొరలుగా అల్లుకున్న లోగిలి
పైపైన కఠినత్వం..
లోలోన అమతత్వం..
నాన్న ఎప్పుడూ పూర్తిగా ఆవిష్కతం కాని వజ్రాల గని...!
చిన్ననాడు నీ ఆటపాటలని
వీపున మోసిన గుర్రపు స్వారి
నువు మారాం చేసినపుడు
గుండెలపై ఆడించి తినిపించిన గోరుముద్ద..!
నీకు బతుకు ఓనమాలు నేర్పడానికి
బెత్తం పట్టుకునే క్రమశిక్షణ
నువు పచ్చ పచ్చగా చిగురించడానికి
లోలోపలి సారవంతమైన మత్తిక..!
చెమట చుక్కల కష్టార్జితాన్ని నీ కోసం
ఇష్టంగా ఇచ్చివేసే త్యాగాల బావుటా
నువ్వు నవ్వుతూ నిలబడడానికి
కన్నీళ్లను దాచిన గరళకంఠుడు..!
ముసిరిన చీకటి ఓటమిలో
నీకు వెలుగునిచ్చే కాంతిపుంజం
కురిసిన నీ చిక్కుముళ్ల జడివానకి
గొడుగై నిలిచే భరోసా..!
జీవన సమరంలో నిత్యం ఓడుతూ
నిన్ను గెలిపించిన మేరునగధీరుడు నాన్న...!
తరతరాల వారసత్వాన్ని నీకు ఇచ్చి
కుటుంబాన్ని నిలబెట్టే ఎనుగర్ర నాన్న..!!
- డా. వాసాల వరప్రసాద్, 9490189847