Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చూపులకు సంకెళ్ళు లేవు
కలలకు సరిహద్దులు లేవు
కళ్ళు మూసుకుని
ప్రతి రోజూ కచేరీకి వెళ్తాను
సితార్, షహనాయీల
జుగల్బందీ వినడానికి
కానీ
సితార తీగలు తెగిపోయాయి
షహనాయీ గొంతు మూగవోయింది
కచేరీలో నిశ్శబ్దం ఆవరించింది
గుండెలన్నీ మౌనంగా రోదించాయి
'కళా భారతి' శిథిలమయి పోయింది
బహుశ నేనిక
కలల్లో కచేరీకి వెళ్తాను
జుగల్బందీని
స్వప్నంలో కలుస్తాను
చూపులకు సంకెళ్ళు వేయలేవు
కలలకు సరిహద్దులు గీయలేవు
- వారాల ఆనంద్,
9440501281