Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీతమింత పెరగక అప్పు తీరదు
పొదుపు చేసి బతికినా అప్పు తప్పదు ||జీత మింత||
ప్రైవేటు జాబుకైనా చేబదులే తప్పనిదై
వడ్డి విరగ బడితే
ఆ అప్పు తీరదు ఆ అప్పు తీరదు ||జీత మింత||
పర్సులోన క్రెడిట్ కార్డు పరువు కాదురా
పల్చనైన దాని కన్న బరువు లేదురా ||పర్సులోన||
పేరు మార్చి పిలిచినా... అది ఉద్దెరే అవుతాదీ
వడ్డి కోత కోసినా... అది అసలు కే ఎసరు ఏత్తాదీ
బ్యాంకులోన తీస్తే అదే ఈయెమ్మై రా...
చిట్టీ లెత్తి కట్టుకుంటె కిస్తీ లంటరా... ||జీత మింత||
అందరూ చూసొచ్చిన తోవ ఒక్కటే...
అప్పు పత్రాలు పలికే మాట ఒక్కటే... ||అందరూ||
కామన్ మ్యానైనా... వీఇపి ఎంతైనా...
అప్పు తీర్చలేకుంటే...
ఐపి ఒక్కటే ఎగవేత ఒక్కటే...
ఎగర నేర్సినోళ్ళ నేమో మాల్యాలంటరా..
ఎదగ అప్పు చేసినోళ్ళే మూల్యం కట్టాలా... ||జీత మింత||
(''ప్రాణం ఖరీదు'' చిత్రంలోని ''యాతమేసి తోడినా ఏరు ఎండదూ...'' అన్న జాలాది గారి పాట సరళిలో సరదా పేరడీ గీతం)
- కుడికాల వంశీధర్, 9885201600