Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మట్టిని కప్పుకునే దేహానికి
వెచ్చని దుప్పట్లెన్ని కప్పుతావు,
చీమలు పీక్కుతినే చర్మానికి
రంగులెన్ని పులుముతావు,
కట్టెలో కాలే సౌందర్యానికి
సొగసులెన్ని అద్దుతావు,
కపాలం భళ్ళున పగిలేదానికి
కిరీటాలెన్ని తొడుగుతావు,
మిగిలే ఎముకల గూడుకు
భవనాలెన్ని నిర్మిస్తావు,
ఊడిపోయే అధికారానికి
అహంకారమెంత చూపుతావు,
ఆవిరయ్యే కొవ్వుకు
ఆహారమెంత అందిస్తావు,
ఆయుష్షు పెంచని ఆసుపత్రికి
ఖర్చులెన్ని వెచ్చిస్తావు,
ఆరిపోయే అల్పప్రాణానికి
మందులెన్ని చమురుగా పోస్తావు,
శాశ్వతం కాదని తెలిసీ
తహతహలాడతావెందుకు,
ఏదీ వెంట రాదని తెలిసీ
తెగ ఆరాటపడతావెందుకు!
- పుట్టి గిరిధర్
9491493170