Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ ఊహలు మోసిందో మయూరమై నా హదయం!!
సిరివెన్నెల కాసిందే అమాసలో నా నయనం!!
లేఖలెన్ని రాసిందో నీ మనసును దోచేందుకు
వలపు దీక్ష పూనిందే వయారమై నా పరువం!!
స్వరములెన్ని దాచిందో అనురాగం పాడేందుకు
వేణువెంత వగచిందో పలకలేక నా రాగం!!
కలల పాన్పు ఎక్కలేదు పగటి భ్రాంతి తీరలేదు
ఏ స్వప్నం ముసిరిందో కలవరమై నా దేహం!!
తపములెన్ని చేసిందో ఓ సత్యా!! నీ మౌనం!
అరమోడ్పు కన్నుల్లో అర్థమవదు ఏ భావం!!
- ఆర్.ఎస్.ఎస్.లక్ష్మి సత్య స్వరాళి,
8790700383