Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కదులుతున్న సైకిల్ చక్రంలా
గిరగిరా గిరగిరా తిరుగుతోంది
వాళ్ళ జీవన చక్రం
ఆకలి పోటుతో, ఆహారపు వేటలో...
రేపటి పౌరులువ్వాల్సిన బాలలు
డొక్క చేస్తున్న చప్పుడుకు తట్టుకోలేక
కొట్టుమిట్టాడుతూ కొట్టుమిట్టాడుతూ
అడుక్కుంటున్నారు రోడ్ల మీద
పది మెతుకులు దోసిట్లో పడితే చాలు
పరమాన్నంలా పంచుకొని తింటూ
ఆ రోజుకు ఆ పిడికెడు పొట్టను
నిద్రపుచ్చుకుంటున్నారు కొంతైనా
ఎన్ని తరాలు మారినా
మారట్లేదీ దేశం తలరాత
ఫ్లాటినం ఉత్సవాలను జరుపుకున్నా
ఈ స్వరాజ్యమింకా ఆకలి రాజ్యమే!
- కార్తీక రాజు, 8977336447