Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకలి కడ్పులతో అల్లాడుతున్న
ఊరి నడిబొడ్డునా
ఎండిన పేగుల మీద
వెచ్చని కవిత్వాన్ని రాస్తున్న..
కన్నీళ్ళకు బదులు
రగులుతున్న చైతన్యాన్ని
జారవిడుస్తున్న
ఇక్కడ నిత్యం
బతుకొక యుద్ధం
పానమొక సమిధ
దొరతనం..
రాచపుండులా ఊరినేలుతుంటే
బానిసత్వంతో
వందల కండ్లు నేలసూపులై నిలబడ్డాయి
వర్గాలు వైషమ్యాలతో
విభజన రేఖలను గీసి
బహుజనుల పానాలతో
మరణశాసనాలకు బీజం నాటవట్టె
ఆకలికి అవమానాలకు
లోంగని పానాలను
ఇక్కడ తొలివరుసలో నిల్పవట్టె..
మా ఊరి అగ్రవర్ణ నయాదొర
దినం దినం ముండయోయనీ..
నీ దొరతనానికి
పిండం బెట్టె దినమోస్తది
8
కాలమే కన్నీళ్లను మోస్తూ
అక్షరాలను జల్లెడ వడుతుంది
పల్లె పదాలే శూలాలై
బానిసత్వాన్ని బొందవెడుతయి
ఊర్ల కుంగిన బొడ్రాయి సాక్షిగా
కూలిపోయే నీ అహాంకారానికి
నా కవిత్వమే సాక్ష్యమైతది.
- బోల యాదయ్య