Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నువ్వు చేరక మునుపే
శూన్య గదిలో విస్తరించిన
గాలివాటంలా
నీ సంగతులన్నీ
చెవులు కొరుక్కుంటూ
అల్ప పీడన మబ్బులైపోతారు..!
నిజా నిజాల్ని తేల్చుకోవటానికి
అసహజ నవ్వుల్ని పూయిస్తూ
ముతక వాసన వేస్తున్న చూపులతో
తడి పొడి మాటల్ని ప్రారంభిస్తారు..!
కొంత దూరం ప్రయాణించాక
నిప్పులు నిగ్గు తేలే భావాన్ని
సత్యస్పందిత గీటురాయిపై పరీక్షించి
ఒకింత సానుభూతిగా వికసిస్తారు..!
ఇంకా శేషప్రశ్నలా తేరిపార చూసి
కొందరు ముందు నుండి దాటిపోతే
చిన్నగా వర్షించిన లోగిలికి కల్లాపిజల్లి
మరికొందరు వెన్నంటి చేరుతారు..!
కొందరు కుడివైపుగా కదిలి
మరికొందరు
ఎడమవైపుగా కదిలి
నీపై ఎక్కుపెట్టిన నిందలకై
భిన్న ధవాలుగా మారి
నీకై తలబడుతారు..!!
- డా. వాసాల వరప్రసాద్
9490189847