Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండిన చెట్టుకు ఒక్క ఆకుపచ్చ ఆకైనా లేకుంటేనేం
అన్ని రంగుల పార్టీ జెండాలతో
అగ్ర తాంబూలంగా రాజకీయాలకు వేదికైంది
జెండాల అంగడి ఎండిన చెట్టు !
పక్షి గూళ్లకు జాగే లేదు !
ఎండిపోయిన చెట్టు ఒకటే !
వందల జెండాలకు ప్రకాండం
అండ దండ ఎజెండా !
మోడైనా పార్టీల జెండాలతో రెప రెప !
జాతీయ రహదారి పక్కన
ఉండే ఈ ఎండిన చెట్టు
జాతీయ ఎన్నికలకే అంకితమై పోయింది !
ఈ చెట్టు పేరు
మద్ది చెట్టు కాదు
రావి చెట్టు కాదు
వేప చెట్టు కాదు
జెండాల చెట్టు !
ఎండిన చెట్టు అభాగ్యంగా నా దేశానికి ప్రతీక
ఈ చెట్టును చూసి దేశంలో ఎన్ని పార్టీలున్నాయో
సర్వే చేయకుండానే చెప్పవచ్చు
చెట్టుకు ఏ ఋతువు లేదు
జెండాలు జెండాలుగా ఎన్నికల ఋతువు
జెండాల చెట్టుకు సెల్యూట్ కొడితే
అన్ని పార్టీలకు జేజేలు కొట్టినట్టే
ఎన్నో వానలకు చెట్టు చిగురిస్తే
పార్టీల జెండాలు కనపడకుండా పోతాయి
ఎండుటాకుల్లా రాలిపోతాయి !
అప్పుడు ఈ చెట్టు సస్యశ్యామల
నా దేశానికి మినార్ ఔతుంది.
- కందాళై రాఘవాచార్య
8790593638