Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచం ఇప్పుడు అశాంతితో
తాండవమాడుతోంది.
రాజ్యాలు యుద్ధాన్ని తవ్వి
మనుషుల్ని పాతేస్తున్నాయి..
స్వార్థం అడుగు పడని చోటు
కనుచూపు మేరలో లేదు
సంకుచిత మనస్తత్వం,
ఈర్ష్య,అసూయలు అన్నదమ్ములై..
జనాల భుజాలపై ఊరేగుతూ...
ఆధిపత్యపు వికృత ధోరణులతో
ధన సంపదే ధ్యేయంగా బతుకుతున్న వైనం.
అశాంతి నిప్పులు కురిపిస్తున్న చోట
శాంతి కుసుమాలు వికసించవు
స్నేహ సౌరభాలు విలసిల్లవు
వికృత చేష్టలతో వినాశనాలు తప్ప...
విజయాలు దక్కవు...!
ఎక్కడ అన్వేషించినా,
ఎంత లోతుల్లోకి తవ్వినా,
స్నేహ రహస్యాలు లభించే తాళపత్ర గ్రంథాల్లో...
మట్టిలోంచి ఉబికే శాంతి ఖనిజాలో... దొరకట్లేదు!
పావురాల రెక్కల్ని విరిచి,
అధినేతలు విర్రవీగుతూ..
వికటాట్టహాసం చేస్తున్నారు.
కాలం..
కరోనాని ఉసిగొల్పి
మేల్కొలపాలని చూసినా...
కుక్క తోక వంకర మనిషి ఇంకా మారలేదు..
మనం మారనంత కాలం
మార్పురానంత కాలం
మరో ప్రపంచాన్ని చూడలేం...!
ప్రశాంత పుడమిని కలగనలేం...!!
- ఎన్.లహరి, 9885535506