Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలంతో కుస్తీపడటం అంటే ఒక యుద్ధమే
రోజురోజుకు నన్నునేను కుబుసం విడిచిన
పాములా మార్చుకొని విహరిస్తున్నాను.
కోరల్లో విషముంటే సరి...
కానీ నా తోటివారికి ఒళ్ళంతా విషమే.
ఎక్కడో కొమ్మమీద కూర్చొని కోకిలమ్మ
కష్టాల గానాన్ని ఆలపిస్తుంది.
నాతో జాతకూడి బాధల హృదయాన్ని
పంచుకోవాలని చూస్తుంది.
పాపం.. కోయిలకు కూడా తెలుసు.. మనిషి
ఒంటరిగా మిగిలిపోయి విలపిస్తున్నాడని.!
తీరం తీరాన తీరని బాదలను తలచుకుంటూ..
కన్నీటిని సంద్రంలో కలిపేస్తున్నాను.
సాగరం అలలై తాకుతూ నన్ను ఓదార్చుతుంది.
కన్నీరును తనలో కలిపేసుకొని..
గుండె గర్భంలో గుమిగూడిన గాయాలను
తన చల్లని నీటితో తడిపేస్తుంది.
చీకటిముసిరిన జీవితానికి కోన్నివెలుగు రేఖలు
అందుతాయని సూర్యున్ని అదేపనిగా
తలచుకుంటున్నాను.
కష్టాలన్నీ నా చుట్టూ కవచాలుగా మారి..
నిశీధిలొనే నన్ను బంధించేశాయి.
రవికిరణాలు నన్ను చేరేదెపుడో.
ఉషోదయాన అల్లుకున్న మంచుతెరల్లా..
తాకిచూస్తే అంతా ఉట్టి మాయే.
ఆనందం ఆవిరై ఎదో ఉహలోకపు విశ్వంలో
జీవిత నావ ప్రయాణిస్తుంది.
కొన్ని వానచినుకులన్నీ కురిసి
గొంతును తడిపే సమయం రాకపోదా అని..
కష్టాల కవచం బద్దలై భానుడి వెలుగులు
నను చేరకపోవా అని ఎదురుచూపు.
- అశోక్ గోనె, 9441317361