Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేల వేల శబ్దాలు
వేలాడుతున్నాయి
చెవికి తోరణాలుగా
శబ్దాలు ఎన్ని అయినా
ఆకలి నేత్రంతో
హదయాంతరంగంలో
మేల్కొల్పిన శబ్దం మాత్రం
ఇంకా మార్మోగుతుంది..
చెవులు ఉన్న చెవిటితనం
నోరు ఉన్న మూగతనం
సత్తువ ఉన్న చేతగానితనం
ఏ కణం లోనైనా
కనిపించని నిప్పుకణం నేను.
ఆలోచన అగ్ని దీపమై
నాలుగు దిశలో సంచరిస్తున్న
కాంతి కోణమై
దయవున్న అభ్యుదయగీతమై
విరబూసిన మందారనేత్రమై
వికసిస్తానుజి
రుధిర రాగమై.....
ప్రకాశిస్తాను
జనం కోరిన ప్రభంజనమై
- సాదే. సురేష్
9441692519