Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తీరం తిరస్కరించింది అని
అల అక్కడే ఆగలేదు కదా
ఓటమి ఎదురు అయినప్పుడు
ఓర్పుతో మరింత నేర్పుతో
గమ్యం కోసం గట్టిగా పోరాడిల్సిందే....
నింగి నేలా కలిసాయా
అభిప్రాయాలు కూడా అంతే
మనుషులు మమతలు పొసగకున్నా
మనసుని సముదాయించి
కలుపుకుని ముందుకు సాగి పోవాల్సిందే....
కాళ్ళ కింద ఇసుక కదిలినట్లు
బతుకు జారి పోయినట్లవుతుంది
ఒక్కసారిగా చీకటి అలుముకుంటుంది
తూలిపడ్డా దిగులు పడ్డా తొందరగా
తిరిగి నువ్వే నిలదిక్కు కోవాల్సిందే...
కోరకుండానే కెరటం ఒకటి
కాళ్లను కౌగిలించుకుని వెళ్తుంది
అమ్మాయి కూడా చిల్ బులే
ఆశల్ని వెదజల్లి బ్రేక్ అప్ చెబుతుంది
జ్ఞాపకాలతో పాత పాట పాడుకోవాల్సిందే....
తనలో ఎన్ని నీళ్లున్నా
దాహం తీర్చిక నిరాశ పరుస్తుంది
బంధాలు అనుబంధాలు అంతే
ఆప్యాయతలు అనురాగం అందక పోవచ్చు
తపిస్తునే గడపాలేమో కడ వరకు...
నేనేం చెప్పనూ
అంతా సముద్రమే చెబుతుంది
ఒక హద్దు వరకూ హాయిగా
మతి చెడి మోహం చెందితే
జీవితం వెనక్కి రాదు సుమా....
- దాసరి మోహన్, 9985309080