Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరణానంతరం .. జీవించటం
చావెరుగని ఆశయాన్ని గెలిచి చూపటం
త్యాగమూర్తులు.. చిరంజీవులు
మానవతా గమనానికి రేపటి తొలి పొద్దులు. ||
స్వేచ్ఛా స్వాతంత్య్రాల సమరపిలుపులు
ప్రజల కొరకు ప్రాణమిచ్చే భగత్ సింగులు
చెరసాలలతో.. చెలిమి చేయటం
ఉరికొయ్యలపై.. ఉయ్యాలలూగటం ||2||
దాస్య శృంకలాలరణం సాగినప్పుడు
ఆజాద్ చంద్రశేఖర్ గుండె చప్పుడు
సుభాష్ చంద్రబోసిచ్చిన సమరనినాధం
భరత జాతి నినదించే విముక్తి గీతము. ||2||
చదువులోనే వెలుగుందని చాటినాడు పూలే
అక్షరాల శరమే.. సావిత్రిబాయి పూలే
సామాజిక ఉద్యమాల అడుగుజాడ అంబేద్కర్
జాతి సమైక్యత కోసం ఒరిగినాడు గాంధీ ||2||
భరతదేశ విప్లవోద్యమాల వెలుగులో
త్యాగాలకేతనం సుందరయ్యరా
శ్రమించినాడు నిరంతరం నిర్భాగ్యుల కోసం
విప్లలవాల బాటయే ఆయన దరహాసం ||2||
- సాంబరాజు యాదగిరి, 9346018141