Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముదిమి వయసులో ఉన్నా
మునుపటి కళ తగ్గలేదు
అనుభవాల రెమ్మలు
అలరారుతున్న సోయగాలు
అనుభూతుల మాలలలో
ఒదిగిఉన్న గులాబీలు
చెప్పకనే చెబుతున్నాయి
జీవన సత్యాలెన్నో....
కంటకాలెన్నున్నా
హొయలు చాటే ఈ పువ్వు
కష్టాలెన్నోచ్చినా ....
చెదరొద్దు చిరునవ్వు
వర్ణాలెన్నున్నా
అంతా కలిసుండాలని
ఒదిగె అందంగా హారాన
కుల మతాలెన్నున్నా
మనమంతా ఒక్కటే నని
తెలుసుకో బిరాన
ఒక్కొక్క రేఖలో
ఎన్నెన్నో జ్ఞాపకాలు
అనుభవాల నైవేద్యం
అందించే ప్రయత్నాలు
చెట్టు వీడిన పుష్పాలు
పట్టువీడక కలిగించు శుభాలు
ఏ శుభ కార్యాలకైనా ..
మేమున్నామంటు నిలిచే సుమాలు
ప్రతి శుభానికి పెద్దరికం
పరిమళించిను కన్నెరికం
మనసున మర్మాలు లేక
అశుభాలలో కూడా ఉంటుంది తోడు
తాను కరుగుతున్నా
ఇస్తుంది కొవ్వొత్తి వెలుగులు
రేకలు రాలుతున్నా
అందిస్తుంది గులాబీ అందాలు
ఓ మనిషి............
తెలుసుకో ఈ జీవిత సత్యం
నీలో ఎన్ని వేదనలున్నా
వదలకు చిరునవ్వులను
అందంగా మలుచుకో
నీ బ్రతుకు బాటను
అనుభవాలే జీవితాన
ఆరిపోని దీపాలని
తెలుసుకొని మసులుకో.......
- లగిశెట్టి ప్రభాకర్, 9441700316