Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరమేధం జరగలేదక్కడ
రక్తపు బొట్టు నేలపై చిందించిందే లేదక్కడ.
కత్తులు దూసింది లేనే లేదెక్కడ.
యుద్ధ తంత్రం జరిపిందే లేదక్కడ.
శ్రమజీవులు స్వేదం చిందించిన నేలపైనే
సమ సమాజం స్థాపించాలనే సంకల్పంతో
లిఖించ బడుతున్న అక్షరం సృష్టిస్తున్న
చరిత్రకు శ్రీకారం ప్రజ్వరిల్లుతుందక్కడ
నవశకానికి నాంది పలుకుతుందక్కడ..
కుహానా నాయకుల కుయుక్తులు
దోపిడీ వ్యవస్థ పునాదులు తెగిపడుతున్నారు.
తరతరాలుగా సాగుతున్న
అనుభవిస్తున్న అధికారం, అంగబలం
ఒక్క సిరాచుక్క సృష్టిస్తున్న సునామీలో
కొట్టుకుపోతున్నారు.
సిరా చుక్కలో పురుడోసుకున్న అక్షరంతో
జన జాగృతి నడికట్టు బిగిస్తుంది.
దొరలకు దాసోహమంటూ మ్రోక్కిన చేతులు..
పిడికి బిగించి అక్షర భావాలను విను వీధుల్లో
ప్రతిధ్వనింప చేస్తుంటే..
నిరాశా నిస్పృహలతో
నిత్యం ఎదలో సంఘర్షణలతో తల్లడిల్లిన
పేదవాని అధరాలు చిరునవ్వులు చిందిస్తున్నారు.
అక్షరమే ఆయుధంగా కవి సమాజంలోని
రుగ్మతలపై సమర శంఖారావం పూరిస్తుంటే.
- రాము కోలా, 9849001201