Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిప్పు కణికలు రగిలిస్తూనే....
నింగికేగిన సాహిత్యలోకపు అలుపెరుగని కలధారి
గోడలు మురుసి, మైరుస్తాయి
వాటిపై లిఖించిన
అతని అక్షరాలను తడుముకుంటూ....
ఏ రోజుకారోజు అనేక కళ్ళు ఆతృత పడతాయి....
అతని వ్యాక్యాలను కళ్లకద్దుకోవాలని....
జనం గుండెల్లో ఉదయించిన ప్రభాకరుడు
తన ఆలోచనలతో సమాజాన్ని ఉర్రూతలూగించిన
విశ్రమించని రవి కిరణం.....
పత్రికల ద్వారా పైకి ఎదిగిన కష్టజీవి
ఉద్యమ కవిగా చరిత్ర సృష్టించిన ధీరకవి
పదాల ఆడంబరం కంటే పరిమళానికి
పెద్దపీట వేసిన సాహిత్య స్వాప్నికుడు.
ద్వేషాన్ని విసిరేస్తూ...
స్నేహాన్నీ ఆలింగనం చేసుకున్న స్నేహశీలి.
తన ఇల్లే ఒక స్నేహాలయం....
ఆకలితో అస్తిపంజరాలైన గాథలను,
ఆకలి చరిత్రను బక్క చిక్కిన
తన దేహంతో అక్షర శిల్పాలుగా చెక్కాడు...
డబ్బుపై యావ లేదు,
కీర్తిపై ధ్యాస లేదు....
బంధాలకే పెద్ద పీట వేస్తూ....
పేదరికాన్ని ప్రేమించి దానిచెంతనే నిశ్శబ్దంగా
విశ్రమించిన మహోన్నత శిఖరం....
ఓ మహాశయా.....
నువ్వు నిష్క్రమించి ఇన్నేళ్లు గడిచినా...
రాతి హృదయంలో నిప్పుల పుష్పంలా ఎప్పటికీ
అందరి మనసులో వెలుగొందుతూనే ఉంటావు...
మనిషిగానే ఉదయించి,
మనిషిగానే అస్తమించిన ఓ మహోన్నతుడా...!
చిరకాలం మా మనసులలో కొలువుంటావు..
అక్షర హాలికుడా.... అందుకో మా జోహార్లు..
ఓ అమరుడా నీకు వేవేల నెనరులు!
- ఎన్. లహరి, 9885535506